కరోనాపై పోరాటం.. టెస్ట్ మ్యాచ్‌లాంటిది

by  |   ( Updated:2020-03-20 02:05:16.0  )
కరోనాపై పోరాటం.. టెస్ట్ మ్యాచ్‌లాంటిది
X

ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటం.. టెస్ట్ క్రికెట్‌ ఆడటం వంటిదని క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లలో సహనం, టీమ్ వర్క్ కచ్చితంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డిఫెన్స్ ఎంతో అవసరమని ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
పిచ్ స్పందిస్తున్న తీరు, బౌలరు వేసే బంతులు అర్థంకానప్పుడు డిఫెన్స్ చేయడమే టెస్ట్ క్రికెట్‌లో మౌలిక సూత్రమన్నాడు. డిఫెన్స్ ఎంత ఆడితే ఆటపై అంత పట్టుసాధిస్తామన్నాడు. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్నా నేపథ్యంలో వైరస్ పట్ల సహనంతో ఉండాలన్నారు. టెస్ట్ క్రికెట్‌లో మాదిరే డిఫెన్స్‌తో కరోనాను కలసికట్టుగా ఎదుర్కొందామన్నాడు.
వన్డే, టీ-20 ఫార్మెట్‌లో ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అయితే.. అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్‌నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని సచిన్ తెలిపాడు. కరోనాపై పోరాటంలో ప్రతి దేశం ఓ టీమ్ గా భావించాలన్నారు. కరోనాపై పోరాటాన్ని టెస్టు మ్యాచుల్లో మాదిరి సెషన్ల వారీగా ఎదుర్కోని విజేతలుగా నిలవాలని సూచించాడు.

Tags: carona, test cricket, sachin

Advertisement

Next Story