- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి లవర్‌తో పారిపోయిన మైనర్.. కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లి షాకైన తండ్రి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయిన కూతురు తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. రాజస్థాన్‌లోని నై కోఠి పిచుపడ కలాన్ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుంది. రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం నడవడంతో ఇరు కుటుంబాలలో ఈ విషయం తెలిసి.. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ మారడంతో వీరు కలవకుండా ఉండలేకపోయారు. అందుకే ఎన్ని గొడవలు జరిగినా.. దొంగ చాటుగా వీరిద్దరు కలవడం మొదలు పెట్టారు. ఒక రోజు మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇంటినుంచి పారిపోయారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లిన తండ్రికి ఊహించని షాక్ తగిలింది.
వివరాల్లోకి వెళ్లితే.. తన కూతురు తన రూమ్‌లో పడుకుంటానని చెప్పి వెళ్లి.. తెల్లవారి చూసే సరికి కూతురు కనిపించక పోవడంతో.. ఆ తండ్రి ఊరంతా వెతికాడు, అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారి ఊరిలో ఉన్న యువకుడిపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించాడు తండ్రి. మా గ్రామంలో ఉండే జితేందర్ అనే వ్యక్తే నా కూతురును తీసుకెళ్లాడు. అంతేకాకుండా ప్లాట్ అమ్మితే వచ్చిన రూ.2లక్షలు కూడా కనిపించడం లేదు’అని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలించారు. ఢిల్లీలో వీరి ఆచూకి దొరకడంతో యువతి, యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు యువతిని తండ్రికి అప్పగించారు. కూతురు నీరసంగా ఉడడం గమనించిన తండ్రి తనను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూతురితో జితేందర్ శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడని తెలిసి తండ్రి షాకయ్యాడు. ‘అతడు నాతో శారీరకంగా చాలాసార్లు కలిశాడు. ప్రస్తుతం నేను అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’అని ఆమె చెప్పింది. 18 ఏళ్లు కూడా నిండని కూతురితో యువకుడు శారీరక సంబంధం పెట్టకున్నాడనితెలియడంతో తండ్రి యువకుడిపై ఫైర్ అయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిని పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.