- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోల్ ఫీజు అడిగితే కారులో నుంచి కత్తి తీసి..
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే పోయే వాహనాల నుంచి ఫీజు వసూలు చేస్తారు టోల్ గేట్ సిబ్బంది. అయితే ఈ టోల్ గేట్ ఫీజును ప్రతీ వాహనదారుడు తప్పకుండా చెల్లిస్తాడు. ఇలా వాహనదారుల నుంచి ఫీజు తీసుకొనే సమయంలో ఊహిచని సంఘటన ఎదుర్కొన్నారు బెంగళూరు టోల్ గేట్ సిబ్బంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటీ అనుకుంటున్నారా..
టోల్ గేట్ దగ్గర కు ఓ వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. దాంతో టోల్ గేట్ సిబ్బంది అతన్ని టోల్ ఫీజు ఇవ్వమని అడిగాడు. దానికి వాహనదారుడు నేను స్థానిక రైతును పొలం పనుల నిమిత్తం పొలం కాడికి వెళ్లి వస్తున్నాను అని చెప్పాడు. పొలం దగ్గరికి వెళ్లే అతను ఇంత ఖరీదైన కారులో వెళ్లి వస్తుంటాడా అనే అనుమానం వచ్చింది టోల్ గేట్ సిబ్బందికి. దీంతో నువ్వు పొలం దగ్గరికి కారులో వెళ్లి వస్తున్నావా.. నువ్వు ముందు ఫీజు ఇవ్వు మని కొంచెం గట్టిగా అడగడంతో ఆగ్రహానికి లోనైన సదరు రైతు నిజం చెప్పినా నమ్మరా.. అంటూ తన పక్క సీట్లో ఉన్న కొడవలి తీసి టోల్ గేట్ సిబ్బంది చేతిలో పెడుతాడు. దీంతో హాడలిపోయిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతును విచారించిన పోలీసులు అతను స్థానిక రైతు అని తెలుసుకొని వదిలివేశారు. ఈ సంఘటన బెంగళూరు, హైదరాబాద్ మార్గంలోని కెంపేగౌడ ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న టోల్ గేట్‌లో చోటు చేసుకుంది.