ఫ్యామిలీలో మెయిన్ విలన్ సమంతనే!

by Shyam |
ఫ్యామిలీలో మెయిన్ విలన్ సమంతనే!
X

దిశ, వెబ్‌డెస్క్ : లేట్ అయినా సరే లేటెస్ట్‌గా వస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. హిందీలో తెరకెక్కిన ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్.. తెలుగు, తమిళ్‌తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ డబ్ అయింది. మొత్తానికి ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో సమంత ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది. ఇందులో సామ్ జస్ట్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తుందనుకున్నా.. మెయిన్ విలన్ అనే న్యూస్ అభిమానులకు నిజంగానే సర్‌ప్రైజ్ ఇచ్చింది. శ్రీకాంత్ మిషన్ వెనుక ఉంటే.. శ్రీకాంత్ వెనుక విలన్ ఉందంటూ.. సామ్ క్యారెక్టర్‌ను ప్రోమో ద్వారా రివీల్ చేశారు మేకర్స్. కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సామ్.. ‘ఈ సారి ఒక్కరు కూడా సేఫ్‌గా ఉండలేరు’ అని హెచ్చరించింది. ఇక రాజీగా కనిపించబోతున్న సామ్ నెగెటివ్ రోల్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఫ్యాన్స్.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాగా.. సెకండ్ సీజన్‌లో అంతకు మించిన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed