పిల్లలకు పురుగులమందు తాగించిన తల్లి.. ఆ తర్వాత తానూ

by srinivas |   ( Updated:2021-04-12 07:34:53.0  )
పిల్లలకు పురుగులమందు తాగించిన తల్లి.. ఆ తర్వాత తానూ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని నున్న గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులకు పురుగులమందు తాగించి ఆ తర్వాత తానూ తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story