హుజురాబాద్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైంది : ఈటల

by Sridhar Babu |
Eatala Rajendar
X

దిశ, కోదాడ : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై ఆయన అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి దళితునికి రూ.10 లక్షల ఇవ్వాలన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులులకు పింఛన్ ఇవ్వాలని కోరారు. హుజురాబాద్‌లో న్యాయం, ధర్మం గెలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి, అక్కిరాజు యశ్వంత్, రాష్ట్ర నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, నకిరికంటి జగన్, సాతులూరు హనుమంతరావు, వంగవీటి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed