యాదాద్రిలో రెడ్ అలర్ట్.. డబుల్ ఇళ్లలో డేంజర్ బెల్స్

by Shyam |   ( Updated:2021-07-15 11:29:11.0  )
double bedroom houses
X

దిశ, భువనగిరి రూరల్: ఎడతెరిపి లేకుండా గతకొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు యాదాద్రిభువనగిరి జిల్లాలో బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని యాదగిరి గుట్ట, ఆలేరు ప్రాంతాల్లో అత్యధికంగా 136 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. యాదగిరిగుట్ట సమీపంలో వంగపల్లి వద్ద వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు నీటమునిగాయి. భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీటమునిగింది. మరోవైపు యాదగిరిగుట్టలోని తోపుగాని చెరువు వర్షానికి ప్రమాదకరంగా అలుగు పోస్తోంది. అలుగు చూడటానికి స్థానికులు భారీ ఎత్తున అక్కడకి తరలివస్తున్నారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అయితే.. ఈ పాటి వర్షానికే డబుల్ ఇళ్లు పూర్తిగా నీటమునిగితే.. వరుసగా ఒక పదిరోజులుగా ఏకధాటిగా వర్షాలు పడితే పరిస్థితి డబుల్ ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏంటని స్థానికులు, లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed