- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమానుషం.. కుక్క మెడకు తాడు కట్టి 5 కిలో మీటర్లు లాక్కెళ్లారు
దిశ, కామారెడ్డి: మూగ జీవి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. కుక్కను కొనుగోలు చేసి బైక్ పై ఎక్కకపోవడంతో కుక్క మెడకు వైరు చుట్టి సుమారు 5 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు. దీంతో కుక్క మెడకు తీవ్ర గాయం అయ్యింది. దీన్ని గమనించిన కొందరు అడ్డుపడి ఆ వ్యక్తిని మందలించి బైక్ పై కుక్కను ఎక్కించి పంపించారు. ఈ సంఘటన ఎంతో మందిని కలిచి వేసింది. ఘటన మాచారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య అనే వ్యక్తి పందులను పెంచుతాడు.
పందులకు కాపలా నిమిత్తం కుక్కను కొనుగోలు చేసేందుకు మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్దకు వెళ్ళాడు. అక్కడ 1000 రూపాయలకు కొమురయ్య కుక్కను కొనుగోలు చేశాడు. ఆ కుక్కను బైకుపై ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేయగా ఆ కుక్క బైకుపై ఎక్కకపోవడంతో కుక్క మెడకు వైర్ చుట్టి సుమారు 5 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు కొమురయ్యను వెంబడించారు. కొమురయ్యను అడ్డుకుని మూగజీవి ఇలా తీసుకెళ్లడం ఏమిటని మందలించారు. కుక్క మెడకు వైర్ కట్టి లాక్కెళ్లడంతో కుక్క మెడకు తీవ్ర గాయం అయింది. అనంతరం స్థానికులు కుక్కను బైకుపై ఎక్కించి పంపించారు.