వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే- ఆలేరు ఎమ్మెల్యే

by Shyam |   ( Updated:2021-09-16 02:40:25.0  )
వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే- ఆలేరు ఎమ్మెల్యే
X

దిశ ఆలేరు: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం ఆలేరు దొంతిరి సోమిరెడ్డి గార్డెన్ లో టీఆర్ఎస్ మండల నూతన కమిటీ అనుబంధ సంఘాల ఎన్నికల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన గొంగిడి సునీత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తే అవహేళన చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ చివరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు.

జనాభిప్రాయం మేరకు టీఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీలో విలీనం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగిస్తూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలతో తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ పాలనలో రైతే రాజు అనే నినాదంతో ముందుకు సాగుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైన విద్యుత్, సకాలంలో విత్తనాలు ఎరువులతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశ పెట్టడంతో రైతన్నలు నేడు పండగ చేసుకుంటున్నారని, దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశ పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎన్నికల మండల ఇంఛార్జీలు ఇమ్మిడి రాంరెడ్డి, గుంటి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్, సింగల్ విండో చైర్మన్లు వస్పరి శంకరయ్య,మొగులగని మల్లేశం, ఏఎంసి వైస్ చైర్మన్ నాగరాజు, సర్పంచులు పాండరీ, రాంప్రసాద్, శ్రీశైలం, మహేందర్ రెడ్డి ,మథర్ డైరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు అనసూయ, పరమేశ్వర, గంగుల శ్రీనివాస్, పిలిప్స్, శోభన్ బాబు, జూకంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed