- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బుల్లెట్ బండెక్కి’ సాంగ్‌తో వైరల్ అవుతోన్న నూతన దంపతులకు సన్మానం
దిశ, గోదావరిఖని : బుల్లెట్ బండి ఎక్కి… అనే పాటకు వివాహానంతరం అప్పగింతల సమయంలో డాన్స్ చేసి షోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన నవవధూవరులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండేషన్ చైర్మన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి సూచన మేరకు గురువారం గోదావరిఖని అంబేద్కర్ భవన్‌లో ఆలయ ఫౌండేషన్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుల్లెట్టు బండి ఎక్కి అనే పాటకు డ్యాన్స్ చేసి యూట్యూబ్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్‌లో లక్షలాది మందిని మెప్పించిన నవ వధువు సాయి శ్రీ శ్రేయ, వరుడు ఆకుల అశోక్‌లను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వారికి పూల బోకే అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వరుడు మంచిర్యాల జిల్లా రామకృష్ణకు చెందిన ఆకుల అశోక్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పని చేస్తున్నారు. ఆలయ ఫౌండేషన్ సిఈఓ రమేష్ బాబు, డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేందర్, వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వధువు తండ్రి రాము.. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జీ, సీనియర్ జర్నలిస్టు బొంకూరి మధు, జాతీయ కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ మంతెన లింగయ్య, జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు చిరంజీవి, చెన్నూరు మురళి, సీనియర్, జర్నలిస్ట్ వడ్డేపల్లి దినేష్, ఉప్పులేటి హనుమంతు, కన్నం, తిరుపతి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.