ఘోర ప్రమాదం.. భార్యాభర్తలు దుర్మరణం

by Shyam |
couple died, road accident
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: భూత్పూర్ మండలం పోల్కంపల్లి స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. భూత్పూర్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి వివరాల ప్రకారం.. తాటికొండ గ్రామానికి చెందిన పోలేమోని కృష్ణయ్య(58), అతని భార్య సుక్కమ్మ(52) దిచక్ర వాహనంపై పని నిమిత్తం పోల్కంపల్లి గ్రామానికి బయలుదేరారు. పోల్కంపల్లి స్టేజి వద్ద 44వ జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుండి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఇరువురు మార్గంమధ్యలోనే మరణించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం కాగా, మరో కుమార్తె, కుమారుడు వికలాంగులు కావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story