- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రం బాగుండాలని కార్పొరేటర్ చండీయాగం
దిశ, మేడిపల్లి: దుర్గామాత చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బోడుప్పల్ కొర్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుప్పల్ నగర పరిధిలోని అనఘాపురి కాలనీలో ఆదివారం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛండీ హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెల్లెంకి జయపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలకు స్థానిక 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ.. కాలనీలు ఐకమత్యంగా ఉండటం మూలంగా వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాత లలితాజంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకురాలు సవితాకరుణాకర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు యాదగిరి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి సదాశివ, సంయుక్త కార్యదర్శి సంతోష్, రాంరెడ్డి, సమన్వయకర్త అబ్బాయిలు, ఆర్గనైజర్ కృష్ణాచారి, సలహాదారు యాదగిరి చారి, సభ్యులు శ్రీనివాస్, శెట్టయ్య, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.