Auto Quotes: ఈ తుఫాన్‌ని తట్టుకొనే దమ్ముందా? ఆటో వెనుక సీఎం ఫోటోతో కొటేషన్ వైరల్

by Ramesh N |   ( Updated:2025-03-30 11:00:29.0  )
Auto Quotes: ఈ తుఫాన్‌ని తట్టుకొనే దమ్ముందా? ఆటో వెనుక సీఎం ఫోటోతో కొటేషన్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ఆటో, లారీ, ట్రక్కుల వెనుక చాలా కోట్స్ రాసుకుంటారు. అమ్మ దీవెన, నాన్న బహుమతి అని ఉంటాయి. ముఖ్యంగా లవ్ కోట్స్, లేదంటే సినిమాల పేర్లు, హీరో హీరోయిన్స్, అభిమాన రాజకీయ నేతల ఫొటోలు కూడా పెట్టడం కామన్. కానీ కొంత మంది సరికొత్తగా ట్రెండీ కొటేషన్స్ (Auto Funny Quotes:) పెడుతుంటారు. తాజాగా అలాంటీ కొటేషనే నెట్టింట వైరల్‌గా మారింది. తెలంగాణ పులి.. ఈ తుఫాన్‌ని తట్టుకొనే దమ్ముందా..? అని సీఎం రేవంత్ రెడ్డి, సింహం ఫోటోను ఆటో వెనుక పెట్టుకున్నాడు ఓ అభిమాని. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని ఈ ఫోటోను యూజర్లు షేర్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఆటో ఫోటో తీసినట్లు యూజర్ వెల్లడించారు. పులి అని సింహం బొమ్మ పెట్టాడు ఏమిటి? అని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed