Supreme Court: లిక్కర్ స్కాంలో ఏపీ ఎంపీ.. కేసు నెం.62గా లిస్ట్

by srinivas |   ( Updated:2025-04-06 14:44:52.0  )
Supreme Court: లిక్కర్ స్కాంలో ఏపీ ఎంపీ.. కేసు నెం.62గా లిస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం(Liquor scandal)లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Rajampet MP Mithun Reddy) ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డిని సీఐడీ పోలీసులు సాక్షిగా చేర్చారు. ఈ మేరకు విచారణకు రావాలని సమాచారం ఇచ్చారు. అయితే అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానంతో ఎంపీ మిథున్ రెడ్డి.. ముందుగానే ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.


అయితే మిథున్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కేసు నెం.62గా ధర్మాసనం లిస్ట్ చేసింది. ఈ మేరకు సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు మిథున్ రెడ్డి సాక్షి మాత్రమే అని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ పెరిగింది. సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలితే ఏం చేయాలనే దానిపై మథన పడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story

Most Viewed