- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: కొందరు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తున్నారు- మోడీ

దిశ, నేషనల్ బ్యూరో: “కొందరు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తున్నారు” అని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. నిధులు రావట్లేదన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశించి మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రామేశ్వరంలోని పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. డీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశరు. తమిళనాడుకు కేంద్రం నిధులు పెంచినప్పటికీ.. కొందరు నిరాశే వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడుకు రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామన్నారు. 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.6 వేల కోట్లు కేటాయించిందన్నారు. రామేశ్వరంలోని స్టేషన్‌తో సహా 77 రైల్వే స్టేషన్లను కూడా ప్రభుత్వం ఆధునికీకరిస్తోందని ఆయన అన్నారు. గత పదేళ్లలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎన్నో పనులు జరిగాయన్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయంతో తమిళనాడులో దాదాపు 4 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.
తమిళంలో వైద్య విద్య అందించాలని..
అంతేకాకుండా, వైద్య విద్యను (Medical Education) తమిళ భాషలో అందించాలని.. దీంతో పేదలకు ప్రయోజనం చేకూరుతుందని స్టాలిన్ సర్కారుకు మోడీ సూచనలు చేశారు. తమిళ భాష, సంస్కృతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, కొందరు నేతలు సంతకాలను తమిళంలో చేయకపోవడం పట్ల ప్రధాని (PM Modi) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం వాటినైనా తమిళంలో చేయాలని కోరారు.
పంబన్ వంతెన..
దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి.. దాన్ని జాతికి అంకితం చేశారు. 21వ శతాబ్దంలో నిర్మించిన ఇంజినీరింగ్ అద్భుతం ‘పంబన్ వంతెన’ (Pamban Bridge) అని ప్రధాని మోడీ అన్నారు. ఈ వంతెన ఆధునికీకరణ డిమాండ్ దశాబ్దాల నుంచి ఉందన్నారు. ప్రజలకు రవాణా పరంగానే కాకుండా ఉపాధి, ఆదాయవృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. మోడీ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం దేశానికే గర్వకారణంగా నిలిచే మూడు వంతెనలు నిర్మించిందన్నారు. ఒకటిముంబైలో సముద్ర వంతెన, రెండోది జమ్ముకశ్మీర్‌లో చీనాబ్ వంతెన, మూడోది పంబన్ బ్రిడ్జి అని చెప్పుకొచ్చారు. భారతరత్న అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జన్మించిన నేల రామేశ్వరం అని.. టెక్నాలజీ, ఆధ్యాత్మికత కలగలిసిన పుణ్యభూమి అని చెప్పుకొచ్చారు.