Weather Update : మరో రెండు రోజులు వడగండ్ల వానలు

by M.Rajitha |
Weather Update : మరో రెండు రోజులు వడగండ్ల వానలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో మరో రెండు రోజులపాటు వడగండ్ల వానలు(Hailstroms) కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రేపు ఎల్లుండి దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాలపై ఈ అకాలవర్షాల ఎఫెక్ట్ ఉండనున్నట్టు పేర్కొన్నారు. గంటకు 40కిమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రేపు సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలు నమోదవనున్నట్టు వెల్లడించారు. పగటి పూట అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దని హెచ్చరించారు. ఏప్రిల్ 8 తర్వాత రాష్ట్రం మొత్తం ఎండలు మళ్ళీ విశ్వరూపం చూపించనున్నట్టు అధికారులు తెలియజేశారు.

Next Story

Most Viewed