PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను తెలుపుతూ మోడీ రాసిన నోట్ వైరల్

by Shamantha N |
PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను తెలుపుతూ మోడీ రాసిన నోట్ వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ ఒక నోట్ రాశారు. నాగ్ పూర్ పర్యటనలో భాగంగా మోడీ.. ఆర్ఎస్ఎస్ పరిపాలనా ప్రధాన కార్యాలయం అయిన రేషింబాగ్‌లోని స్మృతి మందిర్‌ను సందర్శించారు. ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ హెడ్గేవార్, రెండవ సర్పంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మోడీ నివాళులు అర్పించారు. అయితే, హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో మోడీ రాసిన నోట్ వైరల్ గా మారింది. "గౌరవనీయులైన డాక్టర్ హెడ్గేవార్ జీ, గురూజీలకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. వారి జ్ఞాపకాలను కాపాడే ఈ స్మారక ఆలయాన్ని సందర్శించిన తర్వాత నేను ఉత్కంఠభరితంగా భావిస్తున్నాను. భారతీయ సంస్కృతి, జాతీయత,సంస్థ విలువలకు అంకితం చేసిన ఈ పవిత్ర స్థలం.. దేశ సేవలో ముందుకు సాగడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రదేశంతో అనుబంధం ఉన్న గొప్ప వ్యక్తుల అంకితభావం, కృషి దేశసేవకు కట్టుబడి ఉన్న లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులకు శక్తి వనరుగా పనిచేస్తాయి. మా ప్రయత్నాల ద్వారా భారతమాత కీర్తి ప్రకాశిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను" అని నోట్ లో రాసుకొచ్చారు. భారతదేశ నిరంతర వైభవాన్ని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బలమైన, ఐక్యమైన దేశం అనే తన దార్శనికతను మరోసారి నొక్కిచెప్పారు. గోల్వాల్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు మోడీ శంకుస్థాపన చేశారు.

Next Story

Most Viewed