- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా డెల్టా పుంజుకుంటోంది : WHO
జెనీవా: తొలిసారిగా భారత్‌లో కనిపించిన కరోనావైరస్ డెల్టా వేరియంట్ ఇతర దేశాల్లోనూ పుంజుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే సామర్థ్యమున్న డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తున్నదని సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వివరించారు. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జర్మనీలోనూ వ్యాక్సినేషన్ రేటు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఈ వేరియంట్ పంజా విసరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రష్యాలోనూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. టీకాపై అపనమ్మకం ఒక కారణమైతే, నిహిలిజం మరో కారణంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ పుంజుకోవడంతోపాటు నిపుణులు ఆశగా చూసిన క్యూర్‌వ్యాక్ టీకా ఫెయిల్ అయింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీగల ఈ టీకా ట్రయల్స్ ఫలితాల్లో దాని ఎఫికసీ 47శాతమేనని తేలింది. ఇది డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు దూరంగా నిలిచింది. టీకా సామర్థ్యం కనీసం 50శాతముండాలన్నది డబ్ల్యూహెచ్‌వో బెంచ్‌మార్క్.