కరోనా బాధితుడు రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కావొచ్చు: ఈటల

by sudharani |   ( Updated:2020-03-05 06:25:26.0  )
కరోనా బాధితుడు రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కావొచ్చు: ఈటల
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి దుబాయ్ లో కరోనా వైరస్ సోకిందని, అతను మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కావొచ్చని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ గాలితో వ్యాపించేది కాదని, తెలంగాణ ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, ఎలాంటి పరిస్థితుల్లోనై కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గాంధీలో పెండింగ్ లో ఉన్న రెండు కేసులు కూడా నెగెటివ్ గా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని మంత్రి తెలిపారు. మన దేశంలో కరోనా ప్రభావం అంతగా లేదని, రానున్న రోజుల్లో కూడా రాకూడదని కోరుకుందామని ఈటెల పేర్కొన్నారు. అదేవిధంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంత్రి ఈటల కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ రూంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు.

tag: minister etela, corona, Gandhi hospital

Advertisement

Next Story

Most Viewed