- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోఠి మెట్రో స్టేషన్‌కు ఆయన పేరు పెట్టండి.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినాన్ని స్వాతంత్ర్య దినోత్సవం మాదిరి నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కోఠిలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం మూలంగా నిజాం నవాబు నుండి హైదరాబాద్ సంస్థానం భారత్‌లో వీలీనమైందన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొంతమంది నాయకులు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను పక్కనపెట్టి రెండు మతాల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతోనే కలిసి ఊరేగుతున్నారని, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మీరెందుకు చెప్పడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తుర్రెబాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 1857 సెప్టెంబర్ 17న కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి జరిగిందన్నారు. నిజాం పాలన నుండి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన తుర్రెబాజ్ ఖాన్‌కు గుర్తింపుగా కోఠి మెట్రో రైలు స్టేషన్‌కు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు, కన్నయ్య లాల్, నాయకులు కోదండరెడ్డి, రాజేష్ కుమార్, రాజేందర్ రాజు, రాజరత్నం, రాజేష్, వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.