‘అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

by Shyam |
‘అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
X

దిశ, నిజామాబాద్: అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ శరత్ తెలిపారు. కామారెడ్డి, లింగపూర్, తాడ్వాయి మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. మూడ్రోజుల్లో ధాన్యం కొనుగోలులను మొత్తం పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, సహకార సంఘం సీఈవో మోహన్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed