కేంద్రం కీలక నిర్ణయం.. బెగ్గర్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

by Shamantha N |   ( Updated:2021-09-20 07:46:24.0  )
beggars
X

దిశ, డైనమిక్ బ్యూరో : నగరాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే బిచ్చగాళ్లు దర్శనిమిస్తుంటారు. హైదరాబాద్ లో సిగ్నల్ పడిందంటే చాలు.. యాచించడం మొదలుపెడుతుంటారు. గుళ్లు, పార్కులు ఇలా ఎక్కడ పడితే అక్కడ నగరంలో కనిపిస్తూనే ఉంటారు. ఇలా నిత్యం యాచించి కడుపు నింపుకునేవారిని చూస్తూ ఉంటాం. అయితే వారిని ఈ వృత్తి నుంచి దూరం చేసి వారికి జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు పడనున్నాయి. కేంద్రం బిచ్చగాళ్ల స్థితిని మార్చేందుకు ‘స్మైల్’ పథకాన్ని తీసుకొచ్చారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద బిచ్చగాళ్ల సంక్షేమానికి నిధులు కేటాయించింది. రాబోయే 10 సంవత్సరాలు వారి జీవనోపాధి, పునరావాసం, విద్య, శిక్షణ గురించి తగిన చర్యలు తీసుకోనుంది. అయితే, దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ సహా దేశంలోని 10 నగరాల్లో ప్రవేశపెట్టనుంది. అందులో ఢిల్లీ, ముంబై, పాట్నా, ఇండోర్, చెన్నై, బెంగళూరు, నాగపూర్, హైదరాబాద్, లక్నో, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి.

ఈ పథకం ద్వారా బిచ్చగాళ్లందరి వివరాలను ముందుగా సేకరిస్తారు. అందులో భాగంగా వారు యాచించే ప్రాంతం, విద్యార్హత, ఆరోగ్యం మొదలైన వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి పునరావాసం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో పది నగరాలకు గాను రాబోయే ఐదేళ్లలో రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటి ద్వారా వారి పునరావాసానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు నైపుణ్యం పెంచి ఉద్యోగావకాశాలు, చిన్న వ్యాపారాలు చేసే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed