ఆ ఖాతాలు బ్లాక్ చేయండి.. ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు

by Shamantha N |
ఆ ఖాతాలు బ్లాక్ చేయండి.. ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు
X

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు పంపింది. సుమారు 1200 మంది ఖాతాదారులను సస్పెండ్ లేదా బ్లాక్ చేయాలని ఆదేశించినట్టు కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆ ఖాతాదారుల ఖలిస్తానీ సానుభూతిపరులని, లేదా పాకిస్తాన్ నుంచి మద్దతు పొందుతున్నవారివని పేర్కొన్నట్టు వివరించాయి. అలాగే, కొన్ని అకౌంట్లు ఆటోమేటెడ్ బాట్లు అని, వదంతులు వ్యాపించడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించినట్టు తెలిపాయి.

ఈ నోటీసులతోపాటు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ రైతులకు మద్దతునిచ్చిన ఓ ట్వీట్‌ను లైక్ చేసిన సంగతినీ పరిశీలించిందని వివరించాయి. ఈ నోటీసులకు స్పందించకుంటే కోర్టు నుంచి స్టే ఆదేశాలు తెచ్చుకోవచ్చునని, అప్పటి వరకు చట్ట ప్రకారం పైన పేర్కొన్న ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించింది. గతంలోనూ 257 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం నోటీసులు పంపింది. అయితే, తాత్కాలికంగా ఆ అకౌంట్లను సస్పెండ్ చేసినా స్వల్పకాలంలోనే పునరుద్ధరించింది. దీనిపై కేంద్రం ఆగ్రహించింది. అంతేకాదు, భావప్రకటన స్వేచ్ఛ అంటూ ట్విట్టర్ తన స్పందనలో పేర్కొంది. ట్విట్టర్ వేదిక తనకు తానుగా న్యాయస్థానంగా భావించవద్దని కేంద్రం మండిపడింది. తాజాగా, ఈ నెల 4వ తేదీన నోటీసులు చేసినట్టు అధికారవర్గాలు వివరించాయి.

Advertisement

Next Story