- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులూ.. వ్యాక్సిన్ వేయించుకోండి
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: 45 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలో నానాటికీ విజృంభిస్తున్న కొవిడ్-19 ఉధృతిని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా సాగాలని బావిస్తున్న కేంద్రం.. ఈ మేరకు ఉద్యోగులంతా టీకాను వేసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రవర్తనా నియమావళి (ప్రోటోకాల్స్) ని పాటించాలని స్పష్టం చేసింది.
అంతేగాక ఉద్యోగులంతా విధిగా మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రతను విధిగా అలవాటు చేసుకోవాలని సూచించింది. 45 ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ వయస్సు దాటిన ఉద్యోగులంతా టీకా వేసుకోవాలని కేంద్రం తాజా ప్రకటనలో తెలిపింది.
Advertisement
Next Story