విమాన సేవలపై ఆంక్షలు పెంపు.. అప్పటివరకు ఫ్లైట్స్ రద్దు

by Shamantha N |   ( Updated:2021-07-30 05:30:23.0  )
విమాన సేవలపై ఆంక్షలు పెంపు.. అప్పటివరకు ఫ్లైట్స్ రద్దు
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సేవలపై ఆంక్షలను కేంద్రం మరోసారి పొడిగించింది. వచ్చే నెల 31 దాకా రద్దును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వందే భారత్, ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు నడిచే విమానాలపై ఈ నిర్ణయం ప్రభావముండదని తెలిపింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా అవసరమైన మార్గాల్లో సేవలను అందించే నిర్ణయం తీసుకోవచ్చని డీజీసీఏ వివరించింది. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత మార్చి 23 నుంచి అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుసార్లు ఆంక్షలను కొనసాగిస్తూ డీజీసీఏ నిర్ణయాలు తీసుకుంటున్నది. కానీ, దేశీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed