సామాన్యులకు భారీ షాక్.. వాచిపోనున్న పెట్రోల్ ధరలు

by Shamantha N |
సామాన్యులకు భారీ షాక్.. వాచిపోనున్న పెట్రోల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50పైసలు, డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్ వసూలు చేయనున్నారు. దీంతో సొంత వాహనాలు ఉన్న సామాన్యులు ఇక పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. ఇప్పుటికే మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.100కు పరుగులు తీస్తున్న క్రమంలో ఇప్పుడు సెస్ విధించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story