- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ప్రశ్న.. కేంద్రమంత్రి క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందో లేదో పరిశీలించడం తమ బాధ్యత కాదని, ఆ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత ఆర్థిక వనరుల నుంచి కట్టుకున్నదని, ఆ అవినీతితో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దాని ప్రాధాన్యత కూడా ఆ ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తూడు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం సాంకేతిక సహకారం, కొన్ని అంశాల్లో మాత్రమే ఆర్థిక మద్దతు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల విషయంలో అమలు చేస్తున్న నిబంధనలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ అవలంభించిందని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ అదే వైఖరి అని తెలిపారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగినట్లు తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని వివరించారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం పై విధంగా బదులిచ్చారు.