- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగవారికి న్యాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా..
దిశ, వెబ్ డెస్క్ : లక్నోలో ఎప్పుడూ రద్దీగా ఉండే వీధి మధ్యలో ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీని పబ్లిక్ లో కొట్టింది. ఈ ఘటన ఆగస్టు నాలుగో తేదీన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో నాడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అయ్యింది.కారణం లేకుండా అతన్ని కొట్టినందుకు ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అతన్ని బహిరంగంగా కొట్టడం, అవమానించడం ,అలాగే అతని ఫోన్ ముక్కలు ముక్కలు చేసినందుకు చాలా మంది అతనిపై సానుభూతి వ్యక్తం చేశారు. అయితే 4 నెలల తర్వాత, సాదత్ అలీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ స్థాపించిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీలో సాదత్ అలీ చేరనున్నారు.
— Saadatali.official (@Saadatalioffic1) November 19, 2021
పార్టీలో చేరిన తర్వాత సాదత్ అలీ మాట్లాడుతూ.. తనకు జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. తాను పార్టీలో చేరడానికి గల కారణాన్ని తెలియజేస్తూ.. మగవారి గొంతును పెంచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, దేశంలో మహిళల వల్ల వేధింపులకు గురవుతున్న మగవారి కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న క్యాబ్ డ్రైవర్లకు అండగా ఉంటానని అలీ తెలిపారు. ఇదే క్రమంలో తన చెంపదెబ్బ కేసును ప్రస్తావిస్తూ, తనకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, తాను ఇప్పుడు రాజకీయ పార్టీలో చేరానని, తద్వారా తనకు న్యాయం జరగాలని కోరాడు. అతనితో పాటు వచ్చిన సాదత్ లాయర్ కూడా తమకు న్యాయం జరగలేదని, అందుకే సాదత్ అలీ పార్టీలో చేరారని చెప్పాడు.
Viral Video: A Girl Continuously Beating a Man (Driver of Car) at Awadh Crossing, Lucknow, UP and allegedly Damaging his Phone inspite of him asking for Reason #Lucknowcabdriver #lucknowgirl pic.twitter.com/w0XN5W3UEj
— Sonu Gupta✨❤️ (@SonuGup46022700) August 4, 2021