తాండూర్‌లో రాకపోకలకు అంతరాయం

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షానికి కాగ్నా నదిపై ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు-కొడంగల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జి చాలాసార్లు తెగిపోయి సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాని పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.

Advertisement