విచారణకు ఇంకెన్నాళ్లు.. సీఐడీపై బాంబే హైకోర్టు అసహనం

by Shamantha N |
Dabholkar, Pansare
X

ముంబయి: హేతువాదులు నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్య కేసులకు సంబంధించి విచారణ ఆలస్యం అవుతుండటంపై బాంబే హైకోర్టు దర్యాప్తు సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది. మూఢ నమ్మకాలపై వ్యతిరేకంగా పోరాడిన దబోల్కర్‌ను గుర్తు తెలియని దుండగులు 2013లో హత్య చేయగా.. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తున్నది. ఇక 2015లో దభోల్కర్ హత్య మాదిరిగానే హతమైన గోవింద్ పన్సారే కేసును మహారాష్ట్ర నేర విచారణ సంస్థ (సీఐడీ) దర్యాప్తు చేస్తున్నది. ఈ ఇద్దరూ చనిపోయి ఏండ్లు గడుస్తున్నా విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటంతో బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనలు 2013, 2015లో జరిగాయి. ప్రస్తుతం మనం 2021 లో ఉన్నాం. విచారణకు ఇంకెన్నాళ్ల సమయం తీసుకుంటారు..?’ అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులలో విచారణ చేయడానికి ఇంకెంత సమయం తీసుకుంటారో స్పష్టంగా తెలియజేయాలని ఆ రెండు సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed