బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి పెద్దపీట

by Shyam |   ( Updated:2021-10-07 09:08:08.0  )
BJP logo
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి పెద్దపీట వేశారు. బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. జాతీయ ఎగ్జిక్యూటివ్​కమిటీలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జీ కిషన్​రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్​రావుకు చోటు దక్కింది. ఆఫీస్​ బేరర్లలో విజయశాంతి, ఈటల రాజేందర్ కు స్థానం కల్పించారు.

బీజేపీ స్టార్​క్యాంపెయినర్ల జాబితా సిద్ధం

హుజురాబాద్​ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్​క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. 20 మందితో కూడిన ఈ జాబితాను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి గురువారం ప్రకటించారు. తనతో పాటు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్​చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్​ రాష్ట్ర ఇన్​చార్జి మురళీధర్​రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్​రావు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్​వెంకటస్వామి, విజయశాంతి, చాడ సురేశ్​రెడ్డి, రమేశ్​రాథోడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్​రెడ్డి, రేవూరి ప్రకాశ్​రెడ్డి ఉన్నట్లుగా ఆయన ప్రకటించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed