- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైక్.. ఒకరి పరిస్థితి విషమం..
దిశ, వికారాబాద్ : ఆర్టీసి బస్సును బైక్ వేగంగా ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా అందులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీహార్, ఝార్ఖండ్ కు చెందిన శుభం మిలాద్, అన్సారి సాఫేద్ లు వికారాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణం పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వికారాబాద్ వస్తుండగా బ్రిడ్జిపైన ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీ కొట్టారు. బైక్ తో సహా బస్సు చక్రాల కిందకు దూసుకు పోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాల పాలు కాగా బైక్ పూర్తిగా ధ్వంసమయింది. వెంటనే వారిని స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శుభం మిలాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.