భారత్ బంద్ కోసం అఖిలపక్షం బైకు ర్యాలీ.

by Sridhar Babu |
burgam-padu
X

దిశ బూర్గంపాహాడ్: భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ బూర్గంపాహాద్ మండలంలో బైకు ర్యాలీ అఖిలపక్షం ఆద్వర్యంలో నిర్వహించారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన దేశంలో ఉన్న సంపదను ఇద్దరు వ్యక్తులకు కట్ట బెడుతున్నారని అన్నారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరికి కంప్లీట్ గా ప్రజల సొమ్మును అమ్ముతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను 29 కార్మిక చట్టాలను 4 కోడ్ లు గా మార్చి పని బారాన్ని పెంచడం, పని గంటలు పెంచడం, ప్రైవేట్ యజమానులకు బానిసత్వంగా కార్మికులను ఉంచడం విపరీతంగా విద్యుత్ చార్జీలు పెంచడం లాంటివి చేస్తోందన్నారు.

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 27న జరుగబోయే భారత్ బంద్ కు వ్యాపారస్తులు , రైతులు, అసంఘటిత కార్మికులు , ఆటో కార్మికులు, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పాలని అఖిలపక్షం నాయకులు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed