- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. పెద్దిరెడ్డి సవాల్
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో దొంగ ఓటర్ల వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ నేతలు వేరే ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి నకిలీ ఐడీ కార్డులతో ఓట్లు వేయిస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని, టీడీపీ నేతలే దొంగ ఓటర్లను తెప్పించి వైసీపీపై దుష్ప్రాచారం చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ అనుకూల మీడియా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
నారా లోకేష్ తాను వీరప్పన్ అంటూ ట్వీట్ చేశారని, తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొలేకనే టీడీపీ దొంగ ఓటర్ల పేరుతో డ్రామాలాడుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు.
Advertisement
Next Story