బిగ్‌బాస్ 4 వచ్చేస్తోంది.. హోస్ట్ ఆయనే

by Anukaran |   ( Updated:2020-07-20 10:06:02.0  )
బిగ్‌బాస్ 4 వచ్చేస్తోంది.. హోస్ట్ ఆయనే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 4 వచ్చేస్తోంది. ఇప్పటికే మూడు సీజన్‌లను విజయవంతం చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌లో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో మీ ముందుకు బిగ్ బాస్ సీజన్ 4 అంటూ స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమో విడుదల చేసింది. అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ బిగ్ బాస్ 4 మొదలుకానుంది. అయితే, 70 రోజుల్లో ఈ సీజన్‌ ముగించేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో హీరో తరుణ్, శ్రద్ధా దాస్, రష్మి గౌతమ్, సింగర్ సునీత, బిత్తిరి సత్తి, యాంకర్ రవి, యాంకర్ లాస్య లాంటి క్రేజీ పేర్లు వినిపిస్తుండడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ కొత్త సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించడం విధితమే.

Advertisement

Next Story

Most Viewed