కరోనాపై బులెటిన్ విడుదల

by srinivas |
కరోనాపై బులెటిన్ విడుదల
X

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకిన నెల్లూరు బాధితుడు కోలుకుంటున్నాడు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్స్‌ను పరీక్షించి.. వైద్యలు డిశ్చార్జ్ చేయనున్నారు. కోవిడ్-19 ద్వారా ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ ప్రభుత్వం సూచించారు. కరోనా అనుమానితుల సమాచారాన్ని.. కంట్రోల్ రూమ్ నెం ‘0866 2410978’కి తెలియజేయాలి. లక్షణాలు ఉన్నవారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని తెలిపారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 777 మందిలో.. వైద్యుల పర్యవేక్షణలో 512 మంది ఉన్నారు. 244 మందికి 28 రోజుల పాటు పర్యవేక్షణ పూర్తయింది. పరీక్షల్లో 57 మందికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, మరో 12 మందికి రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Tags: coronavirus, bulletin, Released, ap govt

Advertisement

Next Story

Most Viewed