- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమల్లోకి నూతన విద్యావిధానం
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నాడు-నేడు, జగనన్న విద్యాకానుక పథకాల ద్వారా ఇప్పటికే విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గురువారం నూతన విద్యా విధానంపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. ప్రతి సంఘం నుంచి అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. నూతన విద్యా విధానంపై వారితో చర్చించనున్నారు. అలాగే ఆయా సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 5 + 3 + 3 + 4 విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యావిధానంలో జరిగే మార్పులు ఇవే
ప్రస్తుతం రాష్ట్రంలో 10+2 విద్యావిధానం అమలులో ఉంది. అయితే ఆ స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇక నుంచి ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పిలుస్తారు. ఆ తర్వాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్ స్కూళ్లు (6-8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేసే అవకాశం ఉంది. ఈ విధానంలో అంగన్వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలనే ప్రతిపాదన ఉంది. ఒకే ప్రాంగణంలో ఇవి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటినే ఫౌండేషన్ స్కూళ్లుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ఈ ఫౌండేషన్ స్కూల్లో ఒక ఎస్జీటీ టీచర్ 1, 2 తరగతులకు బోధన చేయగా.. ప్రిపరేటరీ-1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరుగా ఏర్పాటు చేస్తారు.
మరోవైపు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్‌కు తరలించే అవకాశం ఉంది. యూపీ స్కూల్లో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య ఉంచితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లను అలానే కొనసాగిస్తారు. విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్ చేసి స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న నూతన విద్యావిధానం ద్వారా ఎక్కడా ఒక్క అంగన్వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. సెకండరీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలని ఇప్పటికే అధికారులకు సూచన ప్రాయంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
- Tags
- ap government