ప్రభుత్వం సంచలన నిర్ణయం ముగ్గురు అధికారులు సస్పెండ్

by srinivas |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, సెక్షన్ ఆఫీసర్స్ డి. శ్రీనిబాబు, కె. వరప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారనే అభియోగంతో వీరిని సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.

Advertisement

Next Story