- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్మరశ్మిని అడ్డుకుంటే కేసు.. ‘రైట్ టు లైట్’ యాక్ట్
దిశ, ఫీచర్స్ : యునైటెడ్ కింగ్‌డమ్ రాజధానిగా వెలుగొందుతున్న ‘లండన్’ మహానగరానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి అనేక పాత భవనాలు దేశ, విదేశీ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే వీటిలో కొన్ని పురాతన భవనాలను పరిశీలిస్తే.. వాటి కిటికీల దిగువన ‘ఏన్షియంట్ లైట్స్’(ప్రాచీన లైట్లు) అనే రాతలు కనిపిస్తుంటాయి. ఇవి ‘అల్బేమార్లే వే, క్లెర్కెన్‌వెల్ రోడ్, చైనాటౌన్, కోవెంట్ గార్డెన్, న్యూమాన్ పాసేజ్, గుడ్జ్ స్ట్రీట్’ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువ. ఈ ట్రెండ్ లండన్‌లోనే కాక డోర్సెట్, కెంట్‌తో పాటు ఇంగ్లాండ్ అంతటా చాలాచోట్ల ఈ తరహా సంకేతాలను చూడవచ్చు. ఇంతకీ వాటికి అర్థమేమిటి? ఎందుకు అలా రాశారు?
‘ఏన్షియంట్ లైట్స్’ లేదా ‘రైట్ టు లైట్’ అనేది ఒక ఆంగ్ల ఆస్తి చట్టం. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ధారాళమైన వెలుతురు, గాలి వచ్చేలా కిటికీలను డిజైన్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఐదారు అంతస్థులకు మించి భవన నిర్మాణాలు చేపడుతుండటంతో అవి సూర్యరశ్మికి అడ్డుగా నిలుస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘రైట్ టు లైట్’ అనే చట్టం వచ్చింది. ఈ మేరకు 20 ఏళ్లుగా సెపరేట్‌గా కేటాయించిన కిటికీ నిరంతరాయంగా సూర్మరశ్మిని స్వీకరిస్తుంటే, ఆ ఇంటి యజమానులకు సహజమైన కాంతిని పొందే హక్కు లభిస్తుంది. ఒక వ్యక్తి ఏన్షియంట్ లైట్ హక్కును పొందిన తర్వాత, పక్కనే ఉన్న భూ యజమాని ఎత్తయిన భవనాన్ని లేదా గోడను నిర్మించడం/చెట్లను ఎత్తుగా పెంచడం వంటివి చేయకూడదు. గతంలో కొందరు భవన యజమానులు ఈ విషయంలో తమకు ఆటంకం కలిగించినవారిపై కంప్లయింట్ చేసి న్యాయస్థానాల్లో గెలిచిన సందర్భాలున్నాయి. నిజానికి ఈ చట్టం 1663లో ఇంగ్లాండ్‌లో రూపొందగా, దాని ప్రస్తుత రూపం ‘ప్రిస్క్రిప్షన్ యాక్ట్ 1832’పై ఆధారపడి ఉంది.
కాలిన్స్ డిక్షనరీ ఆఫ్ లా ప్రకారం ‘ఒక భూయజమాని అంతకుముందులా కాంతిని స్వేచ్ఛగా, తగినంతగా ఆస్వాదించడం లేడని భావిస్తే పొరుగువారిని చట్టపరంగా సవాలు చేయవచ్చు. అయితే చట్టమైతే చేశారు కానీ ఆమోదయోగ్యమైన కాంతి స్థాయిలను నిష్పాక్షికంగా లెక్కించలేదు. అందుకు బదులుగా మానవజాతి సాధారణ భావనల ప్రకారం ‘తగినంత కాంతి’ అని చట్టం స్పష్టం చేసింది. సాధారణంగా ఇంట్లో చదవడానికి, ఇతర పనుల కోసం ‘వన్ ఫుట్ క్యాండిల్ ఆఫ్ ల్యుమినన్స్(దాదాపు టెన్ లక్స్)’ అవసరమని రైట్ టు లైట్ ఎక్స్‌పర్ట్ మిస్టర్ పెర్సీ వాల్‌డ్రామ్ సూచించాడు. వాల్‌డ్రామ్ పద్ధతులు 1920ల నుంచి వాడుకలో ఉండగా.. ఇటీవల కాలంలో అవి చాలా విమర్శలకు గురయ్యాయి.