- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ నాకు పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ పదవి’
దిశ,కేసముద్రం : స్వరాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని వారి త్యాగాల వల్లే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు వచ్చాయని మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు సన్మాన సభలో ఆయన మాట్లాడారు.. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని పని చేయకూడదని, కొత్త ,పాత అనే తేడా లేకుండా అందరం కలిసి కట్టుగా ఉండి, మహబూబాబాద్ జిల్లాను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. గ్రూప్ రాజకీయాలు వద్దని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. జిల్లాకు కేసీఆర్ అన్ని పదవులు ఇచ్చారని తెలిపారు. తక్కెళ్ళపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవీ రావడం సంతోషకరమన్నారు.
కేసీఆర్ నాకు పెట్టిన భిక్ష..
కేసీఆర్ నాకు పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ పదవి అని తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు. మంత్రులు, ఎంపీ , ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. జిల్లా వెనుకబడి ఉండడం బాధాకరమని, వార్డు సభ్యులు స్థాయి పదవుల నుండి మంత్రి పదవుల వరకు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీలో నాయకులు లేరని, రానున్న ఎన్నికల్లో సైతం అన్ని పదవులు సునాయాసంగా గెలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాంమోహన్ రెడ్డి, ఫరీద్, తేళ్ల శ్రీనివాస్ , మాధారాపు సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్