- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధాన్యం ట్రాన్స్‌పోర్టు బాధ్యత అసోసియేషన్లదే.. ’
దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ మూలంగా.. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవడానికి వారు పడిన పాట్లు అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుకున్న సమయానికి ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో.. జూన్ 8వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులు ఎవరూ ట్రాన్స్‌పోర్టు డబ్బులు చెల్లించనవసరం లేదని తెలిపింది. దీంతో రైతలకు కొంత ఊరట లభించింది. కాగా బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపునకు జిల్లా అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు టెండర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువ ధరకు టెండర్ వేసిన నిర్మల్ లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్, భైంసా లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్, ఖానాపూర్ విజేత లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌లకు సివిల్ సప్లై కార్పొరేషన్ ధాన్యం తరలింపునకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ధాన్యం తరలింపునకు రైతులు బస్తాకు రూ.10 లారీ డ్రైవర్లకు ఇస్తున్నట్టు తెలిసిందని, కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించాల్సిన బాధ్యత లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లదేనని భాస్కర్‌రావు తెలిపారు. రైతులు ఎవరూ లారీ డ్రైవర్‌లకు డబ్బులు చెల్లించొద్దని ఆయన సూచించారు. ఎవరైనా డబ్బులు చెల్లించినట్టు తెలిస్తే ఆ ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం రైతులు గమనించాలని ఆయన సూచించారు.