- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర నిరాశలో 38 మంది పోలీస్ అధికారులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రిటైర్ మెంట్ వయసు పెంచారని సంబురపడాలో, తమకన్నా జూనియర్ల కింద సబార్టినేట్లుగా పనిచేయాలో అర్థం కాకుండా పోయింది ఆ పోలీసులకు. సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసిన సర్కార్ అందరినీ సంతృప్తిపరుస్తుందని ఆశించినా వీరికి మాత్రం నిరాశే మిగిలింది.
సూపర్ న్యూమరికీ అర్హులు వీరే…
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 122 సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 122 మందికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని, అందులో వరంగల్ జోన్‌కు చెందిన 1995 బ్యాచ్ వారు, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ జోన్లకు చెందిన 1996, 1998 బ్యాచ్‌లకు చెందిన వారు ఉండేలా నిర్ణయం తీసుకుంది. కాగా, వరంగల్ జోన్‌కు చెందిన 1995 బ్యాచ్ కు చెందిన 54 మంది డీఎస్పీలు కానున్నారు. వీరి తరువాత 1996, 1998 బ్యాచ్ హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ జోన్ లకు చెందిన వారికి అవకాశం కల్పించేందుకు జాబితా సిద్ధం చేశారు. దీంతో వరంగల్ జోన్ లోని 1996 బ్యాచ్ పోలీసు అధికారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
మాకూ అవకాశం ఇవ్వండి…
వరంగల్ జోన్‌లోని 1996 బ్యాచ్‌కు చెందిన అధికారులకు డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో వరంగల్ జోన్ లోని 38 మంది 1996 బ్యాచ్ పోలీసు అధికారులు రానున్న కాలంలో తమకంటే జూనియర్లు అయిన 1998 బ్యాచ్ వారికి సబార్డినేట్ లుగా పనిచేయాల్సిన పరిస్థితి ఎదురు కానుంది. వరంగల్ జోన్ లోని 1996 బ్యాచ్ లో శాఖాపరమైన చర్యలు పెండింగ్ ఉన్న వారిని మినహాయిస్తే 35 మంది వరకు డీఎస్పీలుగా పదోన్నతి పొందేందుకు అర్హులుగా ఉన్నారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రాష్ట్రంలోని పెద్దలను, పోలీసు బాసులను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా న్యాయం జరగడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మరో 35 డీఎస్పీ పోస్టులను సూపర్ న్యూమరీ ద్వారా క్రియేట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన వారందరికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.