- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీకాంత్ చారి మలిదశ ఉద్యమ జ్వాల.. లోక్ నాథ్ రెడ్డి
దిశ, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమం జ్వాల శ్రీకాంతాచారి అని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం లో ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మలి దశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఉద్యమకారులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం శ్రీకాంతచారి ఆత్మార్పణతో తారాస్థాయికి చేరిందన్నారు. నవంబర్ 29 , 2009న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా ఉద్యమ నాయకులు సీఎం కేసీఆర్ దీక్ష చేయడానికి బయలుదేరిన సందర్భంలో ఆయనను అప్పటి ప్రభుత్వం అరెస్టు చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ఆ సందర్భంలో కేసీఆర్ అరెస్ట్‌ను జీర్ణించుకోలేని కాసోజు శ్రీకాంతచారి ఎల్బీనగర్ చౌరస్తాలో ప్రజల సమక్షంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల సాక్షిగా ఒంటిపై పెట్రోలు పోసుకుని తనకుతానుగా నిప్పు అంటించుకొని ఆత్మార్పణ చేసుకున్నాడన్నారు. మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదిస్తూ దిక్కులు అదిరేలా గర్జిస్తూ తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరుడు శ్రీకాంతాచారి అన్నారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి డిసెంబర్, 3, 2019 రోజున అమరుడయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఉద్యమ సీనియర్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు, తెరాస ఉద్యమ సీనియర్ నాయకులు కావాలి బాల స్వామి నాయుడు, బసిరెడ్డి స్వామి, బునాది పురం తిరుపతయ్య, పెబ్బేరు మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి సత్తార్, జడ్పీ కార్యాలయం సిబ్బంది, ఉద్యమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.