- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చెత్త బ్యాగు విలువ రూ. 49.6 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: చెత్తబ్యాగును ముట్టుకునేందుకే చాలా మంది కిందామీద పడతారు. కానీ ఇది వింటే మాత్రం ‘ఓ చెత్త బ్యాగు దొరికితే చాలు.. లైఫ్ సెటిల్’ అని అనుకోకుండా ఉండలేరు. ఈ మాటలు నమ్మశక్యంగా లేవు కదా. కానీ ఇది అక్షరాల నిజం. ఆ చెత్త బ్యాగు విలువ.. అక్షరాలా నలభై తొమ్మిదన్నర లక్షల రూపాయలు. ఏంటీ అవాక్కయ్యారా? ఆ విషయమేంటో పూర్తిగా తెలుసుకోండి.
బ్రిటన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టా పొందిన కళాకారుడు గావిన్ టర్క్. అందరిలా.. మూస ధోరణిలో కళాఖండాలు సృష్టిస్తే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో గానీ, ఒక సరికొత్త ఆర్ట్ వర్క్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాంస్యాన్ని కరిగించి ఓ ముద్దలా చేసిన గావిన్.. దాన్ని ఓ గార్బేజ్ బ్యాగ్ రూపానికి తీసుకొచ్చాడు. ఈ ఆర్ట్ వర్క్‌కు ‘డంప్’ అని పేరు కూడా పెట్టాడు. కాగా, ఈ ఆర్ట్ వర్క్‌ను చూసిన వారంతా ఫిదా అవుతుండటం విశేషం. అయితే ఈ ఆర్ట్ బ్యాగ్ విలువ రూ. 49.60 లక్షలు. ‘ద ఫిలిప్స్ ఆక్షన్ హౌస్’.. లిమిటెడ్ ఎడిషన్‌లో వీటిని విక్రయిస్తోంది.
కాంస్యంతో తయారు చేసిన చెత్త బ్యాగ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, తొలిసారి చెత్త బ్యాగుపై మనసు పారేసుకుంటున్నారు కూడా. ఈ బీన్ బ్యాగ్ ధర తెలిసి ఇది చెత్త రూపంలో ఉన్న సంపద అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ‘ఇది సువాసనల చెత్త బ్యాగు, విలువైన చెత్త బ్యాగు, చెత్త బ్యాగు విలువ కూడా మారిపోయింది’ వంటి కామెంట్లు చేస్తున్నారు.