ప్రతిఘటించే శక్తి మహిళలకు ఉంది: మహేశ్ భగవత్

by Sumithra |
ప్రతిఘటించే శక్తి మహిళలకు ఉంది: మహేశ్ భగవత్
X

దిశ, క్రైమ్ బ్యూరో : వేధింపులను ప్రతిఘటించే శక్తి మహిళలకు ఉందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ ఏడాది (2020) మహిళలపై వేధింపులు, దాడులు తదితర నేరాలు అత్యధికంగా నమోదు కావడం బాధాకరమైనా, మహిళలకు భద్రత కల్పించడం సవాల్‌గా తీసుకుంటామన్నారు. ప్రముఖ దర్శకుడు శశాంక్ రామానుజన్ చిత్రీకరించిన అమ్మే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన జూబ్లీహిల్స్ ప్రసాద్ ల్యాబ్ స్టూడియోలో మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ మహేష్ భగవత్, ప్రముఖ సినీ నటి సనా హజరయ్యారు. మహిళలు దైర్యంగా ఉండడానికి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం చాలా అవసరం అన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వేయి మంది బాలిక పోలీస్ క్యాడెట్లకు యుద్ద కళారూపమైన కలరియపట్టు విద్యను నేర్పించినట్టు తెలిపారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై నిరంతరం అందుబాటులో ఉండే పోలీస్ డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏడున్నర నిమిషాలలోనే స్పాట్ కు చేరుకుంటున్నట్టు తెలిపారు. ఏదైనా ఘటనలో మహిళలు, బాలికలు తమను తాము రక్షించుకోవడానికి విశ్వాసంగా ఉండాలన్నారు. ప్రముఖ సినీ నటి సనా మాట్లాడుతూ.. దర్శకుడు శశాంక్ రామానుజన్‌కు 25వ లఘుచిత్రాలను పూర్తి చేసుకోవడంపై అభినందించారు. ఈ చిత్రంలో నటించిన రీమా,గౌతమి, బేబి హాసిని తదితరులను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed