ముందు కొవిడ్ 19.. ఇప్పుడు పాము కాటు

by Shamantha N |
ముందు కొవిడ్ 19.. ఇప్పుడు పాము కాటు
X

కొంతమందిది దురదృష్టమో లేక విధి వైపరీత్యమో తెలియదు.. ఒకదాని వెంట ఒకటిగా ప్రమాదాలు ముంచుకొస్తూనే ఉంటాయి. మహారాష్ట్రలోని థానే ఎంఎల్‌సీ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. మొన్నటికి మొన్న ఆయన కొవిడ్ 19 నుంచి కోలుకుని యేవూర్ హిల్స్‌లో తన బంగళాకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాడు. కొవిడ్ 19 కారణంగా దాదాపు చావు అంచులదాక వెళ్లొచ్చిన ఆ శివసేన ఎంఎల్‌సీకి ఇప్పుడు పాము కరిచింది. దీంతో ఆయన కొవిడ్ 19 కోసం చికిత్స పొందిన ఆస్పత్రిలోనే మళ్లీ జాయిన్ అయ్యాడు.

కొవిడ్ 19 నుంచి కోలుకున్నాక 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాల్సి ఉండగా.. ఆయన యేవూర్ హిల్స్‌లో ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శనివారం రోజు సాయంత్రం ఆయన లాన్‌లో తిరుగుతుండగా విషపూరిత పాము ఆయనను కాటేసింది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు చెప్పారు. (ఆయన కొవిడ్ 19 పేషెంట్ కావున పేరును ప్రస్తావించలేకపోతున్నాం).

Advertisement

Next Story