ట్రోల్స్ చేసేవారికి తమన్ అదిరిపోయే కౌంటర్

by Jakkula Samataha |
ట్రోల్స్ చేసేవారికి తమన్ అదిరిపోయే కౌంటర్
X

దిశ వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసిన తమన్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పలు సినిమాల గురించి అప్డేట్ ఇచ్చాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్, మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారువారి పాట సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాల గురించి స్పందిస్తూ.. సర్కారువారి పాట నుంచి త్వరలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు రానున్నాయని, ఆగస్టు నెలలో ఈ సినిమా సాంగ్స్‌తో కలుద్దామని చెప్పాడు. ఇక వకీల్ సాబ్ సాంగ్స్ అద్భుతంగా వస్తాయన్నాడు.

ఇక ఈ సందర్భంగా తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తమన్ స్పందించాడు. తాను అసలు వాటిని పట్టించుకోనని, అవి చూసే సమయం కూడా తనకు లేదన్నాడు. తనపై ట్రోల్స్ చేసేవాళ్లు విలువైన సమయాన్ని పొగోట్టుకుంటున్నారని తమన్ చెప్పాడు.

Advertisement

Next Story