- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘మాస్టర్’ ఓటీటీలోనే..?
దిశ, వెబ్‌డెస్క్ : తమిళ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘మాస్టర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతుందా? ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి క్రేజీ కాంబినేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే సందడి చేయనుందా? అంటే ఔననే అంటోంది కోలీవుడ్ మీడియా. సినిమా పూర్తయ్యి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా.. థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తారా లేక ఓటీటీకి ఓటేస్తారా? అనేది విషయాన్ని ఇంకా తేల్చలేదు ఫిల్మ్ మేకర్స్. కానీ ఫైనల్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్ బాట పట్టనున్నారని తెలుస్తోంది. కరోనాతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్న మేకర్స్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్నారని టాక్.
‘మాస్టర్’ టీమ్ ముందు నుంచి కూడా థియేటర్‌లోనే సినిమా రిలీజ్ చేయాలని భావిస్తోంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన ప్రజెంట్ సిచ్యువేషన్ వారికి హెల్ప్ అయ్యేలా కనిపించడం లేదు. మాస్టర్ థియేట్రికల్ వాల్యూ రూ. 70 కోట్లకు పైగా ఉండగా.. ఇప్పుడు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేస్తే కనీసం రికవర్ కాస్ట్ కూడా రాదనేది అంచనా. మరోవైపు విజయ్ ఓవర్‌సీస్ మార్కెట్ రూ.30 కోట్లకు పైనే. కానీ ఫారిన్ కంట్రీస్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవుతుండటంతో అక్కడ కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే చాన్స్ లేదు. ఇండియాలో సినిమా హాల్స్ ఓపెనింగ్‌కు అనుమతించినా చాలా రాష్ట్రాల్లో ఇంకా తెరుచుకోలేదు. పైగా ఇప్పటికే సినిమా పూర్తయ్యి ఎనిమిది నెలలకు పైగా అవుతుండటం.. లేట్ చేస్తే పరిస్థితి మరింత బ్యాడ్ అయ్యే చాన్స్ ఉండటంతో.. ఇక ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతికి ఓటీటీలో మాస్టర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుండగా.. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.