కేటీఆర్ ఆదేశం.. సూర్యాపేటలో నివేదిక

by Shyam |
కేటీఆర్ ఆదేశం.. సూర్యాపేటలో నివేదిక
X

దిశ, తుంగతుర్తి: నిన్న జరిగిన 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సిరిసిల్లలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొని తిరిగి వెళుతున్న క్రమంలో దివ్యాంగురాలు పులి విజయమ్మ అనే మహిళ సూర్యాపేట జిల్లా మాలిపురం గ్రామ చేనేత కార్మికుల సమస్యలపై కేటీఆర్ కు విన్నవించడం తెలిసిందే. ఆయన వెంటనే సూర్యాపేట జిల్లా చేనేత కార్మికుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కేటీఆర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయాన్నే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామంలో చేనేత కార్మికుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

విజయమ్మ అల్లుడు ఇంటివద్దకు అధికారులు వచ్చి నీకు ఉన్న సమస్య ఏమిటి, ప్రభుత్వం నుండి నీకు ఏ సహాయం కావాలని అధికారులు అడుగగా.. కార్మిక పెన్షన్, వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ లేని రుణం, సొంత ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు తెలిపాడు. ఈ విధంగా గ్రామంలోని సుమారుగా 30 చేనేత కార్మికుల కుటుంబాల్ని కలిసి సమస్యల పట్ల అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యల, స్థితిగతులపై వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకులు మహమ్మద్ జహీరుద్దీన్, తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ ఉమేష్ చారి, తిరుమలగిరి ఎమ్మార్వో సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story