టాటా పవర్స్‌తో టెస్లా చర్చలు..!

by Harish |
 టాటా పవర్స్‌తో టెస్లా చర్చలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అంతర్జాతీయ ఎలక్ట్రిక్ దిగ్గజం టెస్లా ఇంక్, దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్‌ అనుబంధ విద్యుత్ తయారీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టెస్లా సంస్థ ఈ ఏడాది చివర్లో భారత్‌లో తన మోడల్ 3 ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దేశీయంగా దిగుమతి చేసుకుని విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. రాయ్‌టర్స్ సమాచారం ప్రకారం..టెస్లా సంస్థ కర్ణాటకలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని తర్వాత కార్ల వినియోగానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కీలకం కానున్న నేపథ్యంలో టాటా పవర్‌తో టెస్లా కంపెనీ చర్చలు జరుపుతోందని, ఇవి ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై ఖచ్చితమైన వివరాలేవీ తెలియలేదు. ఇరు సంస్థలు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ఈ ఏడాది జనవరిలో టెస్లా మోటార్స్ ఇండియా సంస్థ భారత్‌లో బెంగళూరులో తయారీకి రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed